మరదలి వరసయ్యే యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెతో మంచిగా ఉంటూ.. వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. భూపాల్‌పల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆ ఫంక్షన్‌కు వచ్చిన మరదలి వరసయ్యే యువతిని చూశాడు. ఇక అప్పటినుంచి ఆమెపై అతడి కన్ను పడింది.
బాధితురాలి వాట్సాప్ నంబరు తీసుకుని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. యువకుడి వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.