హైదరాబాద్ ఫలక్ నుమాలో దారుణం చోటు చేసుకుంది. డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించటం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఆ యువతిని చంపి ఆ తర్వాత మృతదేహాన్ని దుండగులు యువతి ఇంటి సమీపంలో నగ్నంగా పడేశారు. ఇక సమాచారం తెలియటంతో పోలీసులకు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక యువతిని ఎవరు చంపారనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆ యువతి మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత ఏడాదే తన భర్త మరణించటంతో కుటుంబాన్ని ఆ యువతి పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ యువతి మరణానికి గల కారణాలు ఏంటనేది కొన్ని రోజుల్లో తేలనుంది. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.