ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కోచింగ్ సెంటర్‌కు వచ్చిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. చాన్స్ దొరికినప్పుడల్లా ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి లైంగికంగా లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చితే అబార్షన్ ట్యాబ్లెట్లను ఇచ్చి గర్భం పోగొట్టాడు. అనంతరం అతని కానిస్టేబుల్‌గా ఉద్యోగం రాగానే ప్లేట్ ఫిరాయించాడు. తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, నువ్వంటే ఇష్టం లేదంటూ యువతిని మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదారాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా గడివేడు మండలానికి చెందిన దాసరి రాములు(29) సైబరాబాద్‌లో కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా నార్సింగి జాహిర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2017లో ఓ యువతి ఎస్‌ఐ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అదే సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్న రాములు యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన ఆమెకు మయమాటలు చెప్పి స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. 2020లో రాములు కానిస్టేబుల్‌గా ఎంపికై అక్టోబర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ఇక్కడి నుంచి రాముల అసలురంగు బయటపడింది. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.