సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలను అరికట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. వారు ఉండటం వలనే ప్రజలు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. కేవలం సంఘ విద్రోహ శక్తుల నుంచే కాకుండా, ఇతర ప్రమాద సమయాల్లో కూడా ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. తాజాగా చనిపోయిందని అందరూ భావించిన ఓ మహిళను సమయస్పూర్తితో ఓ కానిస్టేబుల్ కాపాడారు.
సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలను అరికట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. వారు ఉండటం వలనే ప్రజలు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. కేవలం సంఘ విద్రోహ శక్తుల నుంచే కాకుండా, ఇతర ప్రమాద సమయాల్లో కూడా ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. ముఖ్యంగా గుండె పోటు వంటివి వచ్చిన సందర్భాంలో పోలీసులు సీపీఆర్ చేసి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా.. తాజాగా నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. చనిపోయిందనుకున్న మహిళ ప్రాణాలతో తిరిగొచ్చేలా చేసింది. బాధితురాలి సోదరుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగర్ కర్నూల్ పట్టణంలో రాంనగర్ ప్రాంతంలో జగదీశ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం కీర్తి అనే యువతితో వివాహం జరిగింది. కొంతకాలం క్రితం జిల్లా పరిషత్ ఆఫీస్ లో పని చేస్తూ జగదీశ్ తండ్రి మరణించాడు. కారుణ్య నియామకాల్లో భాగంగా తండ్రి ఉద్యోగం జగదీశ్ కు వచ్చింది. ఇటీవలే అతను జిల్లా పరిషత్ కార్యాలయంలో క్లర్క్‌గా విధుల్లో చేరాడు. జగదీశ్ కు వెంకటేశ్ అనే సోదరుడు, తల్లి పద్మ ఉన్నారు. ఇంటిని చిన్న కుమారుడు వెంకటేశ్ కి ఇవ్వాలని తల్లి పద్మ భావించింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అత్త, మరిది గత కొంత కాలంగా కీర్తిని, జగదీశ్‌ను వేధిస్తున్నారంట.
ఈ వివాదంపై నాలుగు నెలల క్రితం కీర్తి పోలీసులను ఆశ్రయించగా.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం కూడా వారి వేధింపులు ఆగకపోవటంతో కీర్తి సోమవారం రాత్రి ఇంట్లో లో ఉరేసుకుంది. కీర్తి ఉరేసుకొని చనిపోయిందని గద్వాలలో ఉండే ఆమె తల్లి, సోదరుడు రఘుకు సమాచారం అదించారు. బాధితురాలి సోదరుడు నాగర్ కర్నూలో పనిచేసే తన స్నేహితుడైన కానిస్టేబుల్ మల్లేశ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి కానిస్టేబుల్ మల్లేశ్ చేరుకున్నాడు. ఆమె చనిపోయి ఎంతసేపు అయిందని కానిస్టేబుల్ అత్తింటివారిని అడ్డగా.. కాసేపు అయిందని వారు సమాధానం ఇచ్చారు.
దీంతో మల్లేశ్.. కీర్తికి వెంటనే సీపీఆర్ చేయడంతో ఆమెలో కదలిక వచ్చాయి. వెంటనే ఆమెను నాగర్ కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో కీర్తి ప్రాణాలు దక్కాయి. కీర్తి మెడ దగ్గర బోన్ ఫ్యాక్చర్ కావటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఒక వ్యక్తి చనిపోయిన నిమిషాల వ్యవధిలో సీపీఆర్ చేస్తే.. బతికే అవకాశం ఉంటుందని తమకు శిక్షణ సమయంలో చెప్పారని కానిస్టేబుల్ మల్లేశ్ తెలిపారు. ఆయన చేసిన పనికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.