ప్రజలకు ఆదర్శ ప్రాయంగా నిలవాల్సిన ఆ కానిస్టేబుల్ తప్పుదోవ పట్టాడు. తాగిన మైకంలో నానా రభస చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు నిత్యం ప్రజల కోసం శాంతిభద్రతలను సంరక్షిస్తుంటారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటేనే క్షణం తీరిక ఉండదు. నిత్యం కేసులు, ఫైల్స్, మంత్రుల రాకతో ట్రాఫిక్ డ్యూటీలు, ఉత్సవాలు, నాయకుల మీటింగులు, రద్దీ ప్రదేశాలలో జనాలను అదుపు చేస్తూ పోలీసులు ఫుల్ బిజీగా ఉంటారు. ప్రతిరోజు ఏదో ఓ దగ్గర గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో తలమునకలవుతుంటారు. అలా ఎప్పుడూ ప్రజల సేవలో ఉండే పోలీస్ శాఖకు ఓ కానిస్టేబుల్ మాయని మచ్చ తెచ్చాడు.
అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి తలదించుకునే పని చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉదయం పూటనే తప్ప తాగి కారు నడుపుతూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. రోడ్డు మీద తాగిన మత్తులో కారు నడుపుతూ ఒక బైక్ ను ఢీకొట్టాడు. తాగి కారు అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తున్న పోలీసును గ్రామస్తులు అడ్డుకున్నారు. కారు కీ స్ తీసుకుని నిర్భంధించారు. అంత చేసి కూడా పోలీస్ వెనక్కు తగ్గలేదు. గ్రామస్తుల మీదకే తిరగబడ్డాడు.
దీంతో వారు 100 కి కాల్ చేసి పోలీసులను పిలిపించారు. ‘‘సామాన్యులకు డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తారు. మరి పోలీసులకు కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలి’’ అంటూ గ్రామస్తులు పట్టుబట్టి టెస్ట్ చేయించారు. తాగి డ్రైవింగ్ చేస్తూ నానా రభస చేస్తున్న కానిస్టేబుల్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.