దేశంలో అమ్మాయిలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 3 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల పండు ముసలవ్వల వరకు.. ఇలా ఎవరినీ వదలకుండా దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అయితే అచ్చం ఇలాగే హైదరాబాద్ లో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పాతబస్తికి చెందిన ఓ బాలిక (15) తాజాగా ఓ మెడికల్ షాపుకు వెళ్లింది. ఆ బాలికను గమనించిన ఓ మహిళ.. నీకు తక్కువ ధరకే మందులు ఇప్పిస్తానని నమ్మించి కందికల్ లోని బోయగూడలో నలుగురు యువకులు ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లింది. ఆ దుండగులు అప్పటికే మద్యం పీకలదాక మద్యం సేవించి ఉన్నారు. అనంతరం ఆ బాలికకు ఆ యువకులు బలవంతంగా మద్యం తాగించారు. ఆ బాలిక మత్తులోకి జారుకున్న వెంటనే.. ఆటబొమ్మగా భావించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అయితే ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో ఇంట్లో పాటలు పెట్టి సౌండ్ ఎక్కువగా పెంచారు. ఇక ఎలాగో ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఇక తనపై జరిగిన దారుణాన్ని తన తల్లికి వివరించింది. కోపంతో ఊగిపోయిన తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.