అభం, శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిని నమ్మించాడో దుర్మార్గుడు. ఆ తర్వాత ఆ చిన్నారిని ఓ గదిలోకి తీసుకెళ్లి.. అసభ్యరకంగా ప్రవర్తించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అతనో ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. నగరంలోనే ఓ ప్రాంతంలో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే ఇతనికి ఓ స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఇక అప్పుడప్పుడు అతనికి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇకపోతే.. తాజాగా ఈ ల్యాబ్ టెక్నీషియన్ మరోసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఇద్దరూ పీకల దాక తాగారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఇంటి వద్ద ఉంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిపై ఈ దుర్మార్గుడు చాక్లెట్ ఆశచూపి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఇతని పేరు బాబిని మోహన్ (29). కొమరం భీం జిల్లా రెబ్బెన ప్రాంతానికి చెందిన ఇతడు.. పంజాగుట్టలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతడికి ఫిల్మ్ నగర్ లో ఉంటున్న ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలా కొంత కాలానికి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. అయితే మోహన్ ఈ నెల 22న తన స్నేహితుడైన ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరు సాయంత్రం దాక పీకలదాక మద్యం తాగారు.
మోహన్ తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలోనే సమీపంలో ఉన్న ఓ LKG విద్యార్థిపై మోహన్ కన్నేశాడు. ఆ చిన్నారికి చాక్లెట్ ఆశచూపి ఓ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అభం, శుభం తెలియని ఆ చిన్నారి అతని వెంటే వెళ్లింది. ఆ తర్వాత మోహన్ ఆ చిన్నారిని బట్టలు విప్పించి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. అనంతరం ఆ చిన్నారి ఇంట్లో నుంచి ఏడుస్తూ వచ్చి… జరిగిందంతా తన తల్లికి వివరించింది. ఇక కోపంతో ఊగిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు మోహన్ ను పట్టుకుని దేహశుద్ది చేశారు.
ఆ తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ దుర్మార్గుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడైన మోహన్ ను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి దారుణానికి పాల్పడిన ఈ దుండుగుడి దారుణంపై మీరెలా స్పందింస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.