హైదరాబాద్ లో ఓ యువకుడిని కొందరు దుండగులు అర్థరాత్రి కత్తులతో దారుణంగా నరికి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు దండగులు కాపుకాసి ఓ యువకుడిని కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. అసలేం జరిగిందంటే?
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాంతానికి చెందిన డెగావత్ పవన్ (22) కుటుంబ సభ్యులు గత 20 ఏళ్ల కిందటే నగరంలోని షాహిన్ నగర్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అతని కుటుంబ సభ్యులు స్థానికంగా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పవన్ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి మరో వర్గానికి చెందిన యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంత కాలం పాటు పవన్ ఆ యువతితో తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పవన్ వ్యవహారం గతంలో ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పవన్ ను బెదిరించి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయంపై ఇరు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయట. ఇదిలా ఉంటే బుధవారం మరోసారి పవన్, అతని ప్రియురాలి కుటుంబ సభ్యుల మధ్య డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఇదిలా ఉంటే.. అయితే అదే రోజు రాత్రి కొందరు దుండగులు పవన్ ను హత్య చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే పవన్ ఇంటికి వచ్చి అతని రాక కోసం ఎదురు చూశారు. ఇక అర్థరాత్రి పవన్ మూత్రం కోసమని బయటకు రావడంతో.. కాపుకాసి పవన్ సింగ్ ను ఆ దుండగుు కత్తులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
వెంటనే స్పందించిన పవన్ కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో పవన్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులకు పవన్ ను హత్య చేసింది అతని ప్రియురాలి కుటుంబ సభ్యులేనని అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.