దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు మాత్రం మారడం లేదు.
ఇటీవల దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వెలుగులోకి కొన్నే వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధువు ఎవరినీ వదలడం లేదు. మహిళలు పట్టపగలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలే కాదు.. దారుణంగా హత్యలు కూడా చేస్తున్నారు. కొంతమంది కామాంధులు ఆడవారిని మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటారు.. అలాంటి ఘటనే ఓ యువతి విషయంలో జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా వాల్వా గ్రామాని చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాల్వా గ్రామానికి చెందిన ఓ యువతిని కొంత కాలంగా అదే ఊరిలో ఉంటున్న తౌసిక్ షేక్లా అనే వ్యక్తి ఇష్టపడుతున్నాడు. ఆ యువతి రోజు చదువు కోసం కాలేజీకి వెళ్తూ ఉండేది. ప్రతిరోజు తౌసిక్ షేక్లా యువతినికి వెంబడిస్తూ వేధించడం మొదలు పెట్టాడు. ఒకరోజు ఆ యువతిని ఎవరులేని సమయంలో వెంబడిస్తూ వచ్చాడు. ఎందుకు వెంబడిస్తున్నావని అడగగా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. దీనికి ఆ యువతి ఓప్పుకోవడంతో.. కక్ష్యకట్టాడు తౌసిక్ షేక్లా. ఈ క్రమంలోనే యువతితో పెళ్లి అయినట్లు నకిలీ సర్టిఫికెట్ ను తయారు చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులను నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసారు. తౌసిక్ షేక్లా కి సహకరించిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారని విచారిస్తున్నారు. నకిలీ పత్రం ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్ చేసి గ్రామంలో తన పరువు తీశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బోనఫైడ్ సర్టిఫికెట్, నాకు తెలియకుండానే స్కూల్ లో ఉన్న ఫోటో తీసుకొని నకిలీ వివాహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చేయించాడని.. పెళ్లి చేసుకోకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిచించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇటీవల బెయిల్ పై వచ్చిన తౌసిక్ షేక్లా తన బుద్ది మార్చుకోలేదు. మళ్లీ ఆ వేదించడం మొదలు పెట్టాడని.. విషయం గురించి గ్రామ పంచాయితీకి చెబితే అతనికే సపోర్ట్ చేస్తున్నారని వాపోయింది బాధిత యువతి. తౌసిక్ షేక్లా గతంలో హత్య కేసులో నింధితుడిగా జైలుకు వెళ్లాడని.. అతని వల్ల తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆవేదన కన్నీరు పెట్టుకుంది.