ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎలాంటి ఘోరాలకైనా తెగబడున్నారు. సొసైటీలో లగ్జరీగా బతకడానికి చాలా మంది అక్రమమార్గాలు ఎంచుకుంటున్నారు. కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడితే.. మరికొంత మంది డ్రగ్స్ వ్యాపారంతో యువతను మత్తు మాయలో పడేస్తు డబ్బు దోచుకుంటున్నారు. మరికొంత మంది హైటెక్ వ్యభిరాచాలు నిర్వహిస్తూ ఎంతో మంది ఆడవాళ్లను పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఇటీవల పెద్ద పెద్ద నగరాల్లో బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్ల ముసుగులో గుట్టుచప్పడు కాకుండా హైటెక్ వ్యభిచారాలు నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు రైడ్ చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితులు బాగాలేనివారు.. భర్త నుంచి దూరమై ఒంటరిగా బతికేవారు.. లగ్జరీగా బతకాలని ఆశించేవారిని టార్గెట్ చేసుకొని వారికి మాయమాటలు చెప్పి వేశ్యావృత్తిలోకి దింపి హైటెక్ దందాలు చేస్తూ ఈజీ మనీ సంపాదిస్తున్నారు. అంతేకాదు ఈ మద్య హైటెక్ వ్యభిచారం ఆన్ లైన్ సిస్టమ్ తో కూడా నడుస్తుంది. గుంతకల్ టౌన్ స్థానిక ఆచారమ్మ కొట్టాలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొంత కాలంగా ఇక్కడ అమ్మాయిలు అర్థరాత్రి పూట రావడం పై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్ ప్రకారం రైడ్ చేశారు వన్ టౌన్ సీఐ రామ సుబ్బయ్య, ఎస్ ఐ మురారి.
ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబాలు ఉంటున్న కాలనీలో గట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక యువతి, విటుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి కొంత డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు రైడ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకొని మరో నిర్వాహకుడు పారిపోగా అతని గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.