మనిషి జీవితంలో శృంగారం అన్నది ఒక అద్భుతమైన అంశం. ఆకలి, దప్పిక ఎలాగో శృంగారం కూడా అంతే. మానవ సృష్టికి మూలమైన ఈ క్రియ.. మానవ మనుగడ విషయంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి వయసుతో బేధాలుండవు. అంటే.. వయసులో ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ. వయసు మళ్ళాక కోరికలు తక్కువ అని కాదు. అందరిలో కలుగుతాయి. దీన్నే అవకాశంగా మలుచుకుంది..ఓ యువతి. వయసు మళ్లిన వారికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం పనిగా పెట్టుకుంది. అలా అని అందరూ ముసలోళ్లు అని కాదు.. డబ్బున్నోళ్లే ఈ అమ్మాయి టార్గెట్. అలా 68 ఏళ్ల వృద్ధుడిని తన బుట్టలో వేసుకుంది. ఎప్పుడు కాల్ చేస్తుందా అని వేచిచూసేలా అతడిని తయారుచేసింది. ఆ తరువాత ఏం జరిగిందంటే..
గుజరాత్, నవరంగపుర ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల వ్యాపారికి గతేడాది ఆగస్టు 8న రియా శర్మ పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. మోర్బికి చెందిన యువతిగా తనను తాను పరిచయం చేసుకుంది. మొదట నార్మల్ గా మాట్లాడిన యువతి.. మెల్లగా ఆ ప్రశ్నలు సంధిస్తూ అతనిని ఉసిగొల్పింది. తదనంతరం ఆమె బట్టలు లేకుండా వీడియో కాల్ చేసి.. అతనిని అందుకు ఒప్పించింది. ఆ దృశ్యాలను అతనికి తెలియకుండా రికార్డు చేసింది. ఆ తరువాత కొన్నిరోజుల పాటు కాల్ చేయడం మానేసింది. అయితే.. ఉన్నట్టుండి ఒకరోజు కాల్ చేసి ఈ వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించింది.
దీంతో ఆ పెద్దాయన, 68ఏళ్లు వయసులో ఇలాంటివి బయటకొస్తే.. పరువు పోతుందేమో అన్న భయంతో ఆమె చెప్పినట్లే చేశాడు. ఇది జరిగిన అనంతరం ఓ వ్యక్తి అతనికి ఫోన్ చేశాడు. తనను తాను దిల్లీ ఇన్‌స్పెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. అతనికి సంబంధించిన వీడియో క్లిప్ తన వద్ద ఉందని చెప్పి.. రూ.3 లక్షలు వసూలు చేశాడు. మరలా ఆగస్టు 14న ఇంకొకరు ఫోన్ చేసి, ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ సిబ్బందినని చెప్పాడు. మీతో కాల్ మాట్లాడిన యువతి ఆత్మహత్యకు యత్నించిందని, అందుకు ఆ వీడియో కాల్ కారణమని అతనిని భయపెట్టి.. రూ.80.97 లక్షలు రాబట్టాడు.
కొన్నాళ్లకు.. సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి కాల్ చేశాడు. రియా శర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని.. కేసు సెటిల్‌మెంట్‌కు రూ.8.5 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు చేసేదేమీ లేక వారడిగిన మొత్తాన్ని మరలా చెల్లించాడు. ఈ క్రమంలో.. డిసెంబరు 15న కేసు మూసివేసినట్లు ఢిల్లీహైకోర్టు పేరిట నకిలీ ఉత్తర్వులు అతని అడ్రెస్ కు వచ్చాయి. ఆ పత్రాలపై అనుమానం రావడంతో.. అతను సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాడు. రూ.2.69 కోట్లు కాజేశారంటూ మొత్తం 11 మందిపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే నిందితులపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ వ్యాపారిపై, అతనిని నిండా ముంచిన ఆ యువతిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.