ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు దంపతులు. అయితే గత కొన్ని రోజుల నుంచి భర్త అలాంటి వీడియోలకు అలవాటు పడ్డాడు. ఇది మంచి పద్దతి కాదని, మానుకోవాలంటూ భార్య అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది. ఈ క్రమంలోనే అడ్డుచెప్పిన భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు.
కిషోర్ పటేల్-కాజల్ దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. భర్త స్థానికంగా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి భర్త రాత్రిళ్లు అలాంటి వీడియోలకు అలవాటు పడ్డాడు. ఇలాంటి వీడియోలు చూడొద్దని భార్య ఎన్నో సార్లు చెప్పి చూసింది. అయినా వినని భర్త.. అడ్డుకున్న భార్యపై దారుణానికి పాల్పడ్డాడు.
అది గుజరాత్ సురత్ పరిధిలోని కతరగాం ప్రాంతం. ఇక్కడే కిషోర్ పటేల్ (33), కాజల్ (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత ఏడాది కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో వీరి కాపురం సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి భర్త కిశోర్ పటేల్ రాత్రిళ్లు పోర్న్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు.
అలా భర్త పోర్న్ వీడియోలు చూస్తుండగా భార్య ఓ సారి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇలాంటి వీడియోలు చూడొద్దని ఎన్నో సార్లు చెప్పి చూసింది. అయినా బుద్ది మార్చుకుని భర్త.. అదే పనిగా అలాంటి వీడియోలకు అలవాటు పడ్డాడు. అయితే ఇటీవల మరోసారి ఆ వీడియోలు చూస్తూ భార్యకు దొరికాడు. ఇక ఇదే విషయంపై భార్యభర్తలు గొడవ పడ్డారు. క్షణికావేశంలో భర్త కిషోర్ పటేల్ భార్యకు నిప్పంటించాడు. దీంతో భార్య కాజల్ తీవ్రంగా గాయపడింది.
ఆ గాయాలతోనే భార్య భర్తపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కాజల్ మంగళవారం ప్రాణాలు విడిచింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కిషోర్ పటేల్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోర్న్ వీడియోలు చూడొద్దు అన్నందుకు భార్యను చంపిన భర్త కథనంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.