ఈ మధ్యకాలంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కవైపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమ పేరుతో చెట్టపట్టాలేసుకుని తిరిగే వారే ఇలాంటి దారుణాలకు కత్తులు నూరుతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక మోజు తిరికా.. ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మొదట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత కాదు పోమ్మని, హత్యలకు దిగుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఒడిశాలోని భువనేశ్వర్ నగరం. ఇక్కడే జగన్నాథ్, కునిధార్ అనే యువతి యువకుడు నివాసం ఉంటున్నారు. గతంలో విరికి పరిచయం ఉండంతో తరచు మాట్లాడుకుంటూ ఉండేవాడు. అలా వీరి పరిచయమే చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు నచ్చుకోవడంతో ప్రేమించుకున్నారు. దీంతో సినిమాలు, షికారులు అంటూ చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగారు. ఇక ప్రియురాలు మాత్రం ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. దీనికి మొదట్లో ప్రియుడు కూడా అంగీకరించాడు. అలా కొన్ని రోజుల పాటు ప్రేమాయణం కొనసాగింది. ఇక కొంత కాలం తర్వాత ప్రియురాలు కునిధార్ ప్రియుడిని పెళ్లి చేసుకుందామని తెలిపింది. కానీ ప్రియుడికి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టపడలేదు.
ప్రియురాలు మాత్రం ప్రియుడు జగన్నాథ్ వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ తరుచు వేధించేది. దీంతో ప్రియుడు మాత్రం… ఎలాగైన తన ప్రియురాలిని వదిలించుకోవాలనుకున్నాడు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఏది కూడా వర్కౌట్ కాలేదు. ఇలా కాదని భావించిన ప్రియుడు.. ఎలాగైన ప్రియురాలని చంపాలని అనుకున్నాడు. ఇక ప్లాన్ లో భాగంగానే ప్రియుడు జగన్నాథ్ గుజరాత్ లోని సూరత్ ను చూసి వద్దామని ప్రియురాలితో చెప్పాడు. దీనికి ప్రియురాలు కూడా కాదనకుండా సరే నంటూ అతనితో వెళ్లింది. ఇక ఇద్దరూ అక్కడికి వెళ్లాక జగన్నాథ్ ప్రియురాలిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అనంతరం పెళ్లి ప్రస్తావన వచ్చి ఇద్దరి మధ్య మరోసారి మళ్లీ గొడవ జరిగింది. ఇక ఇదే మంచి సమయం అనుకున్న ప్రియుడు జగన్నాథ్ ప్రియురాలు కునిధార్ పై 49 సార్లు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు కునిధార్ అనే అమ్మాయి హత్యకు గురైందని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఇక ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న గుర్తుంపు కార్డులతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా ఆ యువతి పూర్తి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.