ప్రేమ పేరుతో నేటి కాలం కొందరు యువకులు మోసానికి పాల్పడుతున్నారు. మొదట్లో ప్రేమిస్తున్నామని వెంటపడడం, ఆ తర్వాత చేయాల్సినవి అన్నీ చేసి చివరికి మొఖం చాటేస్తున్నారు. అయితే తాజాగా ప్రేమించిన యువతిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్దమైన ఓ యువకుడికి ప్రియురాలు పెళ్లి పీటల మీదే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాళికట్టే సమాయానికి ప్రియురాలు ఎంట్రీ ఇచ్చి పెళ్లి పెటాకులు చేసింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గద్దెరాగడికి చెందిన రాజేష్ అనే యువకుడు, వరంగల్ కు చెందిన అనూష అనే యువతి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. అలా వీరి ప్రేమయాణం గత 8 ఏళ్లపాటుగా సాగినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాజేష్ ఇటీవల ప్రియురాలిని కాదని మరో యువతితో పెళ్లి సిద్దమయ్యాడు. నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లిమండపానికి వరుడు, వధువు బంధువులంతా చేరుకున్నారు. బాజా, భజంత్రీల నడుమ కళ్యాణ మండపం అంతా సందడిగా మారింది.
పెళ్లి తంతులో భాగంగా అన్ని కార్యక్రమాలు చేశారు. ఇక వరుడు వధువు మేడలో తాళికట్టే సమయానికి సినిమాల్లో లాగా ఆగండి అంటూ రాజేష్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. ఏం జరుగుతుందంటూ అందరూ కాసేపు ఆసక్తిగా తిలకించారు. ప్రియురాలు రాజేష్ తో దిగిన ఫోటోలు అందరి ముందు ఉంచింది. ఇక ప్రియురాలు అసలు విషయం బయటపెట్టడంతో వరుడు తెల్లమొహం వేశాడు. దీంతో అతని బండారం బయటపడడంతో వధువు బంధువులంతా మోసం చేస్తావా అంటూ పెళ్లిపీటల మీదే వరుడిని చితకబాదారు. ఇక ఎట్టకేలకు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.