తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. అలా తప్పుడు బాటలో నడిచేవారు పోలీసులకు చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆరాటంలో తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఎదుటి వారిని దోచుకొని తాము సుఖంగా ఉండాలనే భావనతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతర మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ లు ఎక్కువ అయ్యాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. బైక్స్ పై వచ్చి మెడలో గొలుసులు లాక్కెళుతున్నారు.. ఆ సమయంలో కొంతమంది మహిళలు తీవ్రంగా గాయపడటం.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ దొంగ మహిళ తలపై కొట్టి ఆమె మెడపై ఉన్న వస్తువులు.. స్కూటీ తీసుక వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో సీతాలక్ష్మి ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఇదే మంచి అదును అనుకొని సెంథిల్‌కుమార్ అనే దొంగ ఆమె తలపై చెక్కతో బలంగా బాదాడు. వెంటనే ఆమె స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. ఆమె కాళ్లు పట్టుకొని ఫుట్ పాత్ పైకి లాక్కెళ్లి.. ఆమె వద్ద ఉన్న బంగారు వస్తువులు, స్కూటీ తాళాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. కొద్ది సేపటి తర్వాత సీతాలక్ష్మికి స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీతాలక్ష్మి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ టీవీలో చోరీకి సంబంధించి దృశ్యాలు పరిశీలించాడు. ద్విచక్ర వాహనం వెళ్లిన దిశగా దర్యాప్తు చేశారు. అయితే చోరీకి పాల్పపడ్డ సెంథిల్‌కుమార్ పోలీసులను గమనించి తప్పించుకునే క్రమంలో రోడ్డు డివైడర్ కి బలంగా ఢీ కొట్టాడు. దాంతో అతని కాలు విరిగిపోయింది. పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకొని హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.