ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేయడం ఒకప్పుడు ఎక్కువగా జరిగేవి. చోరికి గురైన సొమ్మును ఏదో విధంగా సాధ్యమైనంత వరకు రికవరి చేయవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఇళ్లలో దొంగతనాలు తగ్గి సైబర్ దోపిడిలు పెరిగిపోయాయి. ఈ కాలంలో డబ్బు వినియోగం అనేది ఎక్కువ శాతం ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది. దీంతో మోసగాలు సైతం తమ పంథా మార్చుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మాయ మాటలు చెప్పి నమ్మించి ముంచేస్తున్నారు. తాజాగా మేడ్చల్ లో ఓ మహిళ లెక్చరర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేసి డబ్బు కాజేశారు. దీనికి సంబంధించిన వివరాలు స్థానిక పోలీసులు వెల్లడించారు.
వారి కథనం ప్రకారం… మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలలో శ్వేత అనే మహిళ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. గత నెల 26వ తేదీన గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ జియో టీఎం డాక్యుమెంట్ గడువు ముగిసిందని కస్టమర్ కేర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. అపరిచిత వ్యక్తి ఇచ్చిన నెంబర్ ఫోన్ చేయగా కేవైసీ నెంబర్ అడిగారు. జియో టీఎం డాక్యుమెంట్ రెన్యూవల్ కోసం కావచ్చు అని భావించిన ఆవిడ కేవైసీ నెంబర్ చెప్పింది. ఎనీ డెస్క్ ఓపెన్ చేయమని లెక్చరర్ కు వారు చెప్పగా…ఆమె కనెక్ట్ చేసింది. సర్వీస్ ఛార్జీల పేరిట మొదట రూ.10 డెబిట్ అయ్యాయి.
అనంతరం ఐఎఫ్ ఎస్సీ కోడ్ చెప్పగా మళ్లీ వెంటనే రూ.10 వేలు డెబిట్ అయ్యాయి. షాక్ అయిన ఆ మహిళ లెక్చరర్ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తుంటాము అయిన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోని కొందరు మోసపోతుంటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.