ఓ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై కన్నేశాడు. అంతేకాకుండా ఎవరూ లేని టైమ్ చూసి ఏదో చేయాలని అనుకున్నాడు. కానీ, చివరికి ఏదో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఈ రోజుల్లో కొంతమంది మృగాల్లా రెచ్చిపోతున్నారు. అభం, శుభం తెలియని చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇన్ని రోజులు ఆడ పిల్లలకు బయటే రక్షణ లేదని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఇంట్లో కూడా రక్షణ కరువవుతుంది. అవును మీరు విన్నది. ఓ తండ్రి ఏకంగా కూతురిపైనే కన్నేశాడు. అంతేకాకుండా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అలెర్ట్ అయిన కూతురు తండ్రికి దిమ్మతిరిగే షాకిచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఒరిస్సాకు చెందిన జయశ్రీ నాయక్ అనే మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు (17) కూడా జన్మించింది. ఇదిలా ఉంటే జయశ్రీ నాయక్ చాలా కాలంగానే మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో నివాసం ఉంటుంది. ఇదిలా ఉంటే.. జయశ్రీ నాయక్ పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో గత 3 నెలలుగా సహజీవనం చేస్తుంది. తల్లితో పాటు ఒకే ఇంట్లో కూతురు కూడా ఉంటుంది. కాగా, తల్లి జయశ్రీ ఇటీవల పని మీద బయటకు వెళ్లింది. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో సవతి తండ్రి పద్మనాభ నాయక్ అతిగా మద్యం తాగి ఇంట్లోకి వచ్చాడు. ఇక ఇక వస్తూ వస్తూనే కూతురిపై లైంగికదాడికి యత్నించాడు.
ఇదేం పనంటూ ఆ బాలిక సవతి తండ్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా వినని ఆ దుర్మార్గుడు.. ఆ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఇక తనను తాను రక్షించుకునేందుకు ఆ బాలిక పక్కనే ఉన్న కర్రతో పద్మనాభ నాయక్ తలపై బలంగా బాదింది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక జయశ్రీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా.. అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా కూతురు అసలు నిజాలు బయటపెట్టింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ పద్మనాభ నాయక్ తాజాగా మరణించాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.