రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై కసాయి తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సత్యనారాయణ అనే వ్యక్తికి పెళ్లై ఓ కుమార్తె కూడా ఉంది. అయితే గతంలోనే భార్య మరణించటంతో సత్యనారాయణ కూతురితో పాటు ఉంటున్నాడు. అయితే ఈ దుర్మార్గపు తండ్రి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
గత 15 రోజుల నుంచి కూతురి శారీరకంగా వేధిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ దారుణ ఘటనకు తెర లేపాడు. ఇక బరించలేని యువతి డయల్ 100 కాల్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక సత్యానారాయణను కఠిన శిక్షించాంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కన్న కూతురిపై తండ్రి చేసిన అఘాయిత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.