Nellore: సూర్య నటించిన సినిమాల్లో ‘గ్యాంగ్’ సినిమాది ఓ ప్రత్యేక స్థానం. ‘స్పెషల్ 26’ సినిమా రీమేక్‌గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని అర్హతలు ఉండి కూడా ఐటీలో జాబ్ సాధించలేని హీరో ఎలాంటి పనులకు పూనుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. నకిలీ ఇన్‌కమ్‌టాక్స్ అధికారులుగా మారి సూర్య టీం చాలా చోట్ల దొంగతనాలకు పాల్పడుతుంది. ఇక, ఈ సినిమాను స్పూర్తిగా తీసుకుని చాలా మంది దొంగతనాలకు పాల్పడ్డవారు ఉన్నారు.
తాజాగా, నెల్లూరులోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఇన్‌కమ్‌టాక్స్ అధికారులంటూ కొంతమంది నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. ప్లాన్ బెడిసి కొట్టి చివరకు బొక్కబోర్లా పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాజాగా, నెల్లూరు చిన్న బజార్ ప్రాంతంలో ఓ ఇన్నోవా కారు వచ్చింది. అందులోంచి ఓ ఏడుగురు వ్యక్తులు కిందకు దిగారు. ఓ షాపులోకి ప్రవేశించారు. తమను తాము ఇన్‌కమ్‌టాక్స్ అధికారులగా షాపులోని వారికి పరిచయం చేసుకున్నారు. తనిఖీలు చేస్తామని వారితో చెప్పారు.
యజమాని, షాపులో పనిచేసే పని మనిషిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో యజమాని భయపడిపోయాడు. ఆదాయం వివరాలు ఉన్న పుస్తకాన్ని తెచ్చి వాళ్లకు ఇచ్చాడు. తర్వాత వాళ్లు నగలకు సంబంధించిన బిల్లులు ఇవ్వమని అడిగారు. యజమాని లేవని చెప్పాడు. దీంతో వాళ్లు 12 కేజీల నగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసుకు వచ్చి, బిల్లులు చూపించి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో యజమానికి అనుమానం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసివారిని అడ్డగించారు. దొంగలు అని తేలటంతో చావకొట్టి పోలీసులకు అప్పగించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: అసభ్యకర కామెంట్లు.. వ్యక్తిని పబ్లిక్‌గా చెప్పుతో కొట్టిన యువతి!