ఢిల్లీ శివారు ప్రాంతంలో జరిగిన అంజలి ‘హిట్ ఆండ్ రన్’ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో యువతి శరీరం వెనకభాగం ఛిద్రమైంది. పక్కటెముకలు బయటకు వచ్చాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతింది. వెన్నెముక, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ఆ ప్రమాద సమయంలో ఆమె స్నేహితురాలు నిధి కూడా స్కూటీపై ఉండడం, ఒకరికి గాయాలై మరొకరికి ఎటువంటి గాయాలు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
పైగా.. అంజలి కారు కింద నలిగిపోవడం చూసిన నిధి ఆమెకు సాయం చేయకపోగా అక్కడి నుంచి పారిపోయింది. పైగా అంజలిదే తప్పు అని మాట్లాడింది. దీంతో అంజలి ఫ్యామిలీ మెంబెర్స్ నిధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ న్యూస్ ఛానల్ ANIతో మాట్లాడిన అంజలి కుటుంబసభ్యులు నిధిని విచారించాలని డిమాండ్ చేశారు. ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్లగా ఒకరిని కారు ఎలా ఢీకొట్టిందన్నది వారి అనుమానం. తాను నిస్సహాయ స్థితిలో తన ఇంటికి వెళ్లినట్లు నిధి అంటోంది. తన స్నేహితురాలు కారు కింద పడి ఇరుక్కున్న సంగతి డ్రైవర్‌కు తెలిసినప్పటికీ కారును ఆపకుండా ఆమెను ఈడ్చికెళ్లినట్లు ఆరోపించింది. అయితే.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, చాలా ఏడ్చానని చెప్పింది. ఇది వారి అనుమానాలను మరింత బలపరుస్తోంది.
కళ్ల ముందు స్నేహితురాలు ప్రాణాలు పోతుంటే.. కాపాడడానికి ఎందుకు ప్రయత్నించలేదని అంజలి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. కనీసం.. పోలీసులకైనా సమాచారం ఇవ్వాలి కదా అని అనుమానం వ్యక్తం చేసారు. నిధిని విచారించడమే కాకుండా కేసును సీబీఐ అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంతో భయపడిన తాను నిస్సహాయస్థితిలో తన ఇంటికి వెళ్లినట్లు నిధి మీడియాకు తెలిపింది. కారు కింద అంజలి చిక్కుకున్న విషయం అందులో ఉన్న వారికి తెలుసని తెలిపింది. వారు రెండు సార్లు కారును వెనక్కి ముందుకు నడిపారని, ఆ తర్వాత ఆమెను ఈడ్చుకెళ్లారని వెల్లడించింది. దీంతో ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో తన ఇంటికి వెళ్లిపోయినట్లు నిధి చెప్తోంది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు.
Kanjhawala case | Nidhi & her family should have informed police about the incident. Nidhi should be interrogated. She too is involved. We demand CBI enquiry in the case, it isn’t small case, it’s a painful incident: Prem, Anjali’s maternal uncle pic.twitter.com/gOjwO2rlJk
— ANI (@ANI) January 4, 2023
న్యూ ఇయర్ రోజున అంజలి(20), ఆమె స్నేహితురాలు నిధి స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. డ్రైవ్ చేస్తోన్న అంజలి కారు ముందు చక్రాల కింద ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును 13 కిలోమీటర్ల మేర లాక్కెళ్లారు. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#DelhiHorror: Cops rule out the foul play in Delhi’s ‘hit-and-run’ case; know more about what happened 90 minutes before@AnvitSrivastava with more details
(@GrihaAtul)#Delhi #HitAndRun pic.twitter.com/NA1QbzvZ4P
— News18 (@CNNnews18) January 3, 2023