చంపిన వ్యక్తుల్ని దాచటం కోసం ఫ్రిజ్‌లను, ఫ్రీజర్‌లను వాడటం ఈ మధ్య కాలంలో ఎక్కువయిపోయింది. శ్రద్ధావాకర్ హత్య ముందు, ఆ తర్వాత కూడా చాలా కేసుల్లో కొంతమంది నిందితులు విక్టమ్స్‌ను చంపిన తర్వాత ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లోలో దాస్తున్నారు.
ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. కొందరు వ్యక్తులు తమకు ఇష్టంలేని వాళ్లను వదిలించుకోవటానికి.. అలా కుదరకపోతే చంపటానికి కూడా సిద్దం అవుతూ ఉన్నారు. తాజాగా, ఓ డాబా ఓనర్ తాను ప్రేమించిన అమ్మాయిని వదిలించుకోవటానికి ప్రయత్నించాడు. వేరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, ప్రియురాలు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటంతో ఆమెను చంపేశాడు. చంపి ఆమె శవాన్ని ఫ్రీజర్‌లో దాచాడు. మూడు రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన
న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన ఓ యువతి… నజఫ్‌ఘర్ ప్రాంతానికి చెందిన సాహిల్ గెహ్లాట్ అనే డాబా యజమాని గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు.
సాహిల్‌ను పెళ్లి చేసుకుని, అతడితో జీవితం పంచుకోవాలని ఆ యువతి ఎన్నో కలలు కంది. అయితే, సాహిల్ యువతిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ విషయం యువతి చెవిన పడింది. దీంతో ఆమె సాహిల్ దగ్గరకు వెళ్లింది. పెళ్లి విషయమై అతడ్ని నిలదీసింది. అతడు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె వినలేదు. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఎంత నచ్చజెప్పినా ఆమె వినకపోవటంతో సాహిల్‌కు కోపం వచ్చింది. ఆమెను చంపి తన పెళ్లికి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రియురాలిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమె శవాన్ని సౌత్‌వెస్ట్ ఢిల్లీలోని తన డాబాకు తీసుకెళ్లాడు.
అక్కడి ఫ్రీజర్లో ప్రియురాలి శవాన్ని దాచాడు. దాదాపు మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే ఉంచాడు. యువతి కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి ప్రియుడైన సాహిల్‌పై అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పి దొరికిపోయాడు. పోలీసులు గట్టిగా విచారించటంతో నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు డాబాలోని ఆమె శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరి, పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.