దేశంలో అత్యాచార ఘటనలు పెచ్చుమీరి పోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి సెకనుకు ఎవరో ఒక మహిళ.. వేధింపుల బారిన పడుతూనే ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని కారుతో లాక్కెళ్లి.. అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మహిళల భద్రత గురించి పరిశీలిస్తున్న క్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌కు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. అర్థరాత్రి.. నడిరోడ్డుపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. స్వాతి మలివాల్‌ను లైంగికంగా వేధించాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను కారుతో కొద్ది దూరం లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ సంఘటన దేశంలో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
అంజలి సింగ్ ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతపై తన బృందంతో.. పర్యవేక్షిస్తున్నారు డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో.. పని ముగించుకుని స్వాతి మలివాల్.. ఎయిమ్స్ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో అటుగా ఓ బాలెనో కారు దూసుకొచ్చింది. దానిలో ఉన్న వ్యక్తి మద్యం సేవించి.. మత్తులో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు స్వాతి మలివాల్‌ను చూసి.. ఆమె దగ్గరకు వచ్చి.. తన కారులో ఎక్కాల్సిందిగా బలవంతం చేయసాగాడు. ఆమె నిరాకరించడంతో.. అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిపోయి.. మళ్లీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చాడు.
మరోసారి తన కారు ఎక్కాల్సిందిగా స్వాతి మలివాల్‌ను బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే విసిగిపోయిన స్వాతి మలివాల్.. అతడిని కారు కిటికీలోంచి బయటకు లాగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అతడు కాడు విండో క్లోజ్ చేయడంతో.. స్వాతి మలివాల్ చేయి దానిలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత సదరు వ్యక్తి.. కారును అలానే ముందుకు పోనిచ్చాడు. అలా 15 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత.. అతి కష్టం మీద కిటికీలోంచి చెయ్యిని విడిపించుకుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఆమె టీం.. వెంటనే పరిగెత్తుకు వచ్చారు. ఆ తర్వాత స్వాతి మలివాల్.. సదరు వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మహిళకు రక్షణ ఏవిధంగా ఉందో చెక్ చేద్దామనే ఉద్దేశంతో.. నేనే స్వయంగా ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్లాను. ఓ వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేశాడు. నేను అతడిని పట్టుకునే ప్రయత్నంలో.. నన్ను కారుతో పాటు లాక్కెళ్లాడు. దేవుడే నన్ను రక్షించాడు. ఢిల్లీలోని మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కే ఇలా జరిగితే.. ఇక మిగతా ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో.. ఊహించుకోవచ్చు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
कल देर रात मैं दिल्ली में महिला सुरक्षा के हालात Inspect कर रही थी। एक गाड़ी वाले ने नशे की हालत में मुझसे छेड़छाड़ की और जब मैंने उसे पकड़ा तो गाड़ी के शीशे में मेरा हाथ बंद कर मुझे घसीटा। भगवान ने जान बचाई। यदि दिल्ली में महिला आयोग की अध्यक्ष सुरक्षित नहीं, तो हाल सोच लीजिए।
— Swati Maliwal (@SwatiJaiHind) January 19, 2023
ఈ ట్వీట్ చూసిన నెటిజనులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నా పోలీసుల తీరు మాత్రం మారడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని హరీశ్‌చంద్ర(47)గా గుర్తించి.. అతడి కారును సీజ్ చేశారు. మరి ఢిల్లీ మహిళా చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఎదురవ్వడానికి కారణం పోలీసులు వైఫల్యమే అని భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Delhi ये घटना #SwatiMaliwal के साथ हुई। @SwatiJaiHind
को कार से घसीटा गया। #DCW अध्यक्ष स्वाति मालीवाल के साथ हुई घटना का वीडियो जिसके बाद आरोपी ड्राइवर को गिरफ़्तार कर लिया गया है। pic.twitter.com/OMg59Oo7j8— Vineet Sharma (@vineetsharma94) January 20, 2023