మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు తిట్టారనే, ఉపాధ్యాయులు కొట్టారనే అకారణాలతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు.. వీటినే రుజువు చేశాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు.. వేరొక జీవితం లేదనుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా
ఆలోచన తక్కువే, ఆవేశం ఎక్కువగా కనిపిస్తోంది నేటి యువతలో. చిన్న విషయాలను తీవ్రంగా తీసుకోవడంతో పాటు ప్రతి విషయానికి ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారు. మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు తిట్టారనే, ఉపాధ్యాయులు కొట్టారనే అకారణాలతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు.. వీటినే రుజువు చేశాయి. మార్కులు, ర్యాంకులు కొలమానంగా చూస్తున్నకళాశాలలు, తల్లిదండ్రుల ఒత్తిడితో ఫెయిల్ అయిన విద్యార్థులు.. వేరొక జీవితం లేదనుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పదో తరగతి ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటి నుండే ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
విజయనగరం జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అయితే పదో తరగతి పరీక్షలు సరిగ్గా రాయలేదన్న కారణంగా ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నేరడి-బి గ్రామానికి చెందిన అడ్డసారి రాజకుమారి(15) అనే విద్యార్థిని ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. కొత్తూరు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పదో తరగతికి పూర్తి చేసింది. అయితే సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన రాజకుమారి బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఇంట్లో ఎలకల మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భామిని ప్రభుత్వాసుత్రికి, పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పబ్లిక్ పరీక్షలు సరిగా రాయని కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి అడ్డసారి మహాలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వై.అమ్మాన్‌రావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఫలితాలు రాకుండానే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలవరపాటుకు గురి చేసింది.