మద్యం సేవించి, మైకం కమ్మి, విచక్షణ కోల్పోయి.. ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టి, దాడి చేస్తుంటారు. తాగి.. చిన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తుంటారు. తమకే బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నట్లు మగవాళ్లు ఫీలై..
‘మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహా రాజులం’అని మద్యం ప్రియులు తాగి ఫోజు కొడుతుంటారు కానీ .. ఈ మహమ్మారి జీవితాల్లో ఎంతటి చిచ్చు పెట్టిందో గ్రహించడం లేదు. మద్యం సేవించి, మైకం కమ్మి, విచక్షణ కోల్పోయి.. ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టి, దాడి చేస్తుంటారు. తాగి.. చిన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తుంటారు. తమకే బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నట్లు మగవాళ్లు ఫీలై.. మద్యం వీటికి పరిష్కారమని తమను తాము సర్థి చెప్పుకుంటూ పెగ్గులకు పెగ్గులు తాగేస్తుంటారు. భర్త రోజు తాగి గొడవ పడుతుండటంతో విసిగిపోయిన భార్య అతడిని హత్య చేయడమో, లేదా అతడి చేతిలో హతం కావడమో జరుగుతుంది. తాగి భార్యపై దాడి చేసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
భార్యతో తాగిన మత్తులో గొడవపడి.. ఆపై కొడవలితో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేటలో నివసిస్తున్నారు ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. అయితే మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆపై చేయి చేసుకునేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి తాగొచ్చిన మల్లేష్.. భార్యతో గొడవకు దిగాడు. అనంతరం ఇంట్లో ఉన్న కొడవలితో దాడి చేశాడు. దాడి చేసే ముందు కొడవలిని కాల్చి.. నిర్మల మెడ వెనుక భాగంపై పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ఆమెను కుటుంబ సభ్యులు కరీం నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.