డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చేత మానవ మాంసాన్ని(Human Meat) బలవంతంగా వండించి ఆమెతో తినిపించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే? కాంగోలో మే చివరి నుండి ప్రభుత్వం- తిరుగుబాటు సమూహాల మధ్య భారీ పోరాటం తీవ్రమైన హింసకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీంతో అల్లర్లు చెలరేగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఓ మహిళ బంధువుల ఇంటికి బయల్దేరింది. దీంతో కొందరు తీవ్రవాదులు ఆ మహిళను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన ఆమెను ఉగ్రవాదులు ఆమెపై అత్యాచారం చేసి శారీరకంగా వేధింపులకు గురిచేశారట. ఇక ఇంతటితో ఆగకుండా ఆమెతో పాటు మరికొంత మందిని కిడ్నాప్ చేయడంతో అందులో ఓ వ్యక్తి గొంతు కోశారు. అనంతరం అతని శరీరం నుంచి కొంత మాంసాన్ని తీసి ఉడికించి ఆ మహిళకు తినిపించారట.
ఇది కూడా చదవండి: Nandyala: మైనర్ల ‘ప్రేమకథ’.. అసలేం జరిగిందంటే?
ఇలా కొంత కాలం పాటు ఆ మహిళను శారీరకంగా తీవ్ర హింసకు గురి చేశారు. ఈ ఘటనపై కాంగో హక్కుల సంఘం బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపింది. మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ అధ్యక్షురాలు జూలియన్ లుసెంగ్, తూర్పు కాంగోలో జరిగిన 15 మంది సభ్యుల కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ లుసెంగ్ ఆ మహిళపై జరిగిన దారుణాన్ని వివరించింది. ఇక అనేక దారుణాలకు గురైన ఆ మహిళ చివరికి ప్రాణాలతో బయటపడిందని లుసెంగ్ తెలిపారు.