ఈ రోజుల్లో ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను అత్యాచారం చేస్తూ ఆపై హత్యలు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ గ్రామ వాలంటీర్ 5వ తరగతి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆ బాలికను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది ఏపీలోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఓ ప్రాంతం. ఇక్కడే ఓ 8 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద ఉంటూ స్థానికంగా 5వ తరగతి చదువుతంది. అయితే ఇదే గ్రామంలో శివయ్య అనే వ్యక్తి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల ఆ బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే ఆ బాలికను చూసిన శివయ్య.. ఏదేదో చేయాలనుకున్నాడు. చుట్టపక్కల వారిని అందరినీ గమనించారు. ఆ సమయంలో అతని కంటికి ఎవరూ కనిపించలేదు. ఇదే మంచి సమయం అనుకున్న శివయ్య ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి పెద్దగా కేకలు వేసింది.
దీనిని గమనించిన స్థానికులు పరుగు పరుగున ఘటన స్థలానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన అతగాడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు సీరియస్ అయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై వాలంటీర్ చేసిన దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.