బరితెగించిన ప్రవర్తిస్తున్న కొందరు టీచర్లు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. అబం శుభం తెలియని విద్యార్థినుల పట్ల విర్రవీగి ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ప్రవర్తించాడో మాస్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ గ్రామం. 58 ఏళ్లున్న ఓ టీచర్ ఇదే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి నాలుగు, ఐదు తరగతుల విద్యార్థినిలను లైంగికంగా వేధించేవాడు. రోజు తల దువ్వడం, పౌడర్ అద్దడం వంటివి చేస్తుండేవాడు. బాలికలపట్ల పైశాచికంగా ప్రవర్తించి.. తన వక్రబుద్దిని భయటపెట్టేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే చాక్ పీసుతో తాళికట్టి టీసీ ఇచ్చి పంపిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఇది కూాడా చదవండి: ప్రియుడిని కాదని మరొకడితో పెళ్లి! వధువుపై కాల్పులు జరిపిన ప్రియుడు!
దీంతో తట్టుకోలేకపోయిన విద్యార్థినిలు మాస్టారు వికృత చేష్టల గురుంచి తల్లిదండ్రులకు వివరించారు. మాస్టారు దారుణాలపై గ్రామ సర్పంచ్ ద్వారా కలెక్టరు హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించారు. వీరితో పాటు ఆర్డీవో, డీఈవో, ఎంఈవో, తహసీల్దారు, ఎంపీడీవో ముందు మాస్టారు దారుణాలను చెప్పి బాలికలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీంతో వెంటనే స్పందించిన డీఈవో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.