నేటి కాలంలో కొందరు క్షణికావేశంలో ఎంతకైన తెగిస్తున్నారు. కొందరు ఆస్తి, అంతస్థుల కన్న తల్లిదండ్రులు ఎక్కువేం కాదనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆస్థి పంపకాల్లో భాగంగా తల్లిదండ్రులు తమకు దక్కాల్సిన ఆస్తిని ఇవ్వకపోయే సరికి కోపంతో రగిలిపోతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అడ్డొచ్చిన తల్లిదండ్రులను సైతం కడతేర్చేందుకు వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ కుమారుడు తండ్రిని నడిరోడ్డుపై చంపేందుకు ప్రయత్నం చేశాడు.
దీనికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పీలేరు ప్రాంతం. ఇదే గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కాగా ఇతనికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాయి. గతంలో ఆర్మీ ఉద్యోగిగా సేవలిందించిన ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి కుమారుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి, తండ్రి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఆస్థి వివాదాలు నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లైన 6 నెలలకే బయటపడ్డ భర్త భాగోతం.. తట్టుకోలేక వైద్యురాలు ఏంచేసిందంటే..?ఆస్థిపంపకాల విషయంలో తండ్రి కుమారుడికి వ్యతిరేకంగా నడిచినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే తండ్రిపై కోపంతో రగిలిపోయాడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. ఇక ఎలాగైన తన తండ్రిని చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల తన తండ్రి రోడ్డుపై బైక్ పై వెళ్తున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారమే కారుతో బయలుదేరాడు కొడుకు. రాత్రి సమయంలో తండ్రి బైక్ పై వెళ్తుండగానే వెనకాల నుంచి తండ్రి బైక్ ను ఢీకొట్టి చంపబోయాడు.
స్థానికులు వెంటనే గమనించి గాయాలపాలైన చంద్రశేఖర్ రెడ్డిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.