శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువకముందే సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ కసాయి భర్త భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆమె శవాన్ని వాటర్ ట్యాంక్ లో పడేశాడు. అసలేం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ కసాయి భర్త భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆమె శవాన్ని వాటర్ ట్యాంక్ లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం. ఇక్కడే సవన్ ఠాకూర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా సంతోషంగా సాగుతున్న ఈ భార్యాభర్తల కాపురంలో.. నా భార్య నాకు నమ్మక ద్రోహం చేస్తుందనే అనుకున్నాడు. ఇదే అనుమానం అతడిని రాక్షసుడిలా మారేలా చేసింది. దీంతో అప్పటి నుంచి భర్త.. నా భార్యను ఎలాగైన ప్రాణాలతో లేకుండా చేయాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే రెండు నెలల కిందట భర్త సవన్ ఠాకూర్.. నాకు నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నవని భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త సవన్ ఠాకూర్.. భార్యను ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఆ తర్వాత అతనికి ఏం చేయాలో తెలియక.. భార్య మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేసి చేతులు దులుపుకున్నాడు. అలా రెండు నెలలు గడిచింది. సవన్ ఠాకూర్ ఇంటి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది.
ఎందుకో అనమానం వచ్చిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సవన్ ఠాకూకు ఇంటికి చేరుకున్నారు. అనుమానంతో అతని ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్ లో తొంగి చూడగా.. అందులో ఓ మనిషి శవం కనిపించింది. ఈ సీన్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే ఆ శవాన్ని బయటకు తీయగా.. ఆమె ఎవరో కాదు.. సవన్ ఠాకూర్ భార్యేనని తేలింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయంతో వణికిపోయారు. అనంతరం మృతురాలి భర్త సవన్ ఠాకూర్ ను విచారించగా.. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించేసరికి సవన్ ఠాకూర్ అసలు నిజాలు వెళ్లగక్కాడు.
నా భార్య నాకు నమ్మక ద్రోహం చేస్తుందనే అనుమానంతో హత్య చేసి వాటర్ ట్యాంక్ లో పడేశానని తెలిపాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సవన్ ఠాకూర్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నమ్మకం ద్రోహం చేస్తుందనే కారణంతో భార్యను నరికి వాటర్ ట్యాంక్ లో దాచిన ఈ కిరాతక భర్త దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.