ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. ఓ 6 నెలల గర్బిణి కడుపులో కత్తితో తనకు తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోర్బా పరిధిలోని బుద్వారీలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఇక భార్యపై అనుమానంతో భర్త రోజు వేధిస్తూ ఉండేవాడు. అయితే భార్య 6 నెలల గర్భవతి కావడంతో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
ఇది కూడా చదవండి: యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని గొంతు కోసిన యువకుడు!
కాగా సోమవారం ఏం జరిగిందో తెలియదు కానీ భార్య కత్తితో తనకు తానే కడుపులో పొడుచుకుంది. భార్య రక్తపు మడుగులో పడి ఉండడం వెంటనే గమనించిన భర్త హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ మహిళ చివరికి మరణించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.