చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు ఈ పేరు ఏపీలో దడ పుట్టిస్తుంది. పోలీసులకు సవాలుగా మారినారు చెడ్డీ గ్యాంగ్య్. వారిని పట్టుకోవడం పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్లో మాత్రమే కనిపించిన ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఇప్పుడు ఏపీలో కూడా వరుస చోరీలకు పాల్పడటంతో అందరిలో భయం కలుగుతుంది. అసలు ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఎలా చోరీలకు పాల్పడతాయ్? ఎలా తప్పించుకుంటాయి? భూతద్దం పెట్టి వెదికినా పోలీసులకు ఎందుకు దొరకడం లేదు? ఇప్పుడు అందరి మదిలో మెదిలో ప్రశ్నలు.
చిక్కడు-దొరకడు అన్నట్టు ఉంటుంది ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీల పంథా వేరు. సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే కనిపిస్తారు. అంతా గాఢ నిద్రలో ఉండగానే దొంగతనాలు చేస్తారు. శివార్లలోని విల్లాలు, బంగ్లాలు, అపార్ట్మెంట్లనే చోరీలకు ఎంచుకుంటారు. అయితే ప్రతి చోరీకి ముందుగా పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు. చెడ్డీ గ్యాంగ్ లోని వారికి అన్నీ ఏరియాల మీద అవగాహాన కలిగి ఉంటారు. బెజవాడలో రెండుచోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్స్ బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా చిట్టినగర్ లో ప్రముఖ అపార్ట్మెంట్స్లో చోరీకి విఫలయత్నం చేశాయి.
గతంలో గుంటుపల్లి శివారుల్లో ఓ అపార్టుమెంట్ లోని ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. ఇంతలో ఆ ఇంటి సభ్యలు మేల్కొనడం, వారు గట్టిగా కేకలు వేయడంతో చెడ్డి గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. వారు అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించేది సీసీపుటేజిలో రికార్డ్ అయింది. ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్కి సమీపంలోని తాడేపల్లిలో అలజడి సృష్టించాయి. ప్రముఖులు నివాసముండే రెయిన్బో విల్లాస్లోనే చోరీలకు పాల్పడట్లు సమాచారం. ఈ చెడ్డీ గ్యాంగ్స్ చోరీలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసులకు వీరు పెద్ద సవాలు గా మారారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.