వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. ఎలాంటి గొడవలు రాకుండా ఎంతో సంతోషంగా జీవించేవారు. ఇక కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కొడుకుని గొప్ప చదువులు చదివించి చివరికి ప్రయోజకుడిని చేశారు. కుమారుడు హైదరాబాద్ లోని ఓ మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం రోజు కుమారుడిని చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఊహించని ప్రమాదంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఆ దంపతులు చనిపోవడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తునికి తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు. నిర్మల్ పట్టణానికి చెందిన వీళ్లు ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రాణం. ఇక పెళ్లైన కొంత కాలానికి కుమారుడు వీరికి రామరాజు జన్మించాడు. ఆ దంపతులు చిన్నప్పటి నుంచి కుమారుడిని ఉన్నతమైన చదువులు చదివించారు. ఇక తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామరాజు సైతం బాగా చదువుకుని నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగంలో కుదిరాడు. అయితే తులసీదాస్, రాజమణి దంపతులు నిర్మల్ టౌన్ లో ఉంటుండగా, కుమారుడు మాత్రం గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. ఇక కొత్త సంవత్సరం రోజు తల్లిదండ్రులు కుమారుడు రామరాజు వద్దకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం నిర్మల్ నుంచి బయలు దేని మధ్యాహ్నం బోయినపల్లి బస్టాండ్ లో బస్సు దిగారు. ఆ తర్వాత గచ్చిబౌలి వెళ్దామని పఠాన్ చెరువు బస్సు ఎక్కడానికి ఆ దంపతులు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే అటు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఈ దంపతులను ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో ఎగిరి రోడ్డుపై పడ్డ ఈ దంపతులు ఇక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచారు. స్థానికులు వెంటనే అక్కడిక్కడికి చేరుకోగా వారి అప్పటికే చనిపోయారని తెలుసుకున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కుమారుడు రామరాజుకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన ఆస్పత్రిలో తల్లిదండ్రుల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.