తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 150మంది అస్వస్థతకు గురైన ఆస్పత్రులకు పరుగులు తీశారు. సికింద్రాబాద్ పరిధిలోని చింత బావి బస్తీలో 150 మందికి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు స్పందించారు.
వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్- విశాఖ మధ్య వందభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. తమలా తమ పిల్లలు కష్టపడకూడదని కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం కోసం నగరానికి పంపించారు. చేతికంది వచ్చిన పిల్లలను చూసి మురిసిపోయేలోపు తండ్రుల చేతులతో తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. పొలం దున్ని, కూలి పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు క్యూనెట్ లో ఉద్యోగం అంటే పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు మృతుల తల్లిదండ్రులు.
సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే మంటల్లో భవనం పూర్తిగా కాలిపోవడంతో దానిని కూల్చివేయాలంటూ అధికారులు, నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కూల్చివేత పనులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కూల్చివేత పనులను కూడా ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేత పనులకు ముందు కాసేపు హైడ్రామా నడిచింది. మొదట ఓ […]
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. ఎలాంటి గొడవలు రాకుండా ఎంతో సంతోషంగా జీవించేవారు. ఇక కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కొడుకుని గొప్ప చదువులు చదివించి చివరికి ప్రయోజకుడిని చేశారు. కుమారుడు హైదరాబాద్ లోని ఓ మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం రోజు కుమారుడిని చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఊహించని ప్రమాదంతో ఇద్దరూ ప్రాణాలు […]
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఓ లాడ్జీ లోకి మంటలు వ్యాపించి ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలు అయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, […]
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఓ భవంతిలో మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలుఅయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం […]
సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనతో ఎటు వాళ్లు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్‌లోని ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో కాంక్రీట్ పెళ్లలు చెల్లాచెదురుగా పడ్డాయి. చుట్టూ దుమ్ము, పొగ కమ్మేశాయి. కాసేపు అక్కడ ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. ఆ పేలుడులో భార్యాభర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట పోలీస్ […]
నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. అయితే ప్రాథమిక చికిత్స అందకనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయంలో కసమయస్ఫూర్తితో వ్యవహరిస్తే పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి తేవొచ్చు. తాజాగా ఓ కానిస్టేబుల్ అలానే సమయస్ఫూర్తితో సరైన సమయంలో చేసిన పనితో ఓ నిండు ప్రాణాన్ని తిరిగొచ్చింది. అక్కడున్న అందరూ సదరు పోలీస్ కు సెల్యూట్ చేసి.. శభాష్ సార్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతకి ఆ పోలీస్ చేసిన […]
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణ రంగమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ అనే కొత్త ఆర్మీ నియామకాల పద్ధతిని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. స్టేషన్ లోని ఫర్నిచర్ , షాపులను ధ్వంసం చేసి, పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పులు పెట్టారు. ఈ క్రమంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ స్టేషన్ అగ్నిగుండాన్ని […]