బాలీవుడ్ డైరెక్టర్ అవినాశ్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూజా సింఘాల్ తో అమిత్ షా కలిసున్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అవినాశ్ దాస్ ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే….
డైరెక్టర్ అవినాశ్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇటీవలిదేనని, పూజా సింఘాల్ అరెస్ట్ కావడానికి కొన్నిరోజుల వీరిద్దరూ తీయించుకున్న ఫోటో అంటూ అవినాశ్ దాస్ క్యాప్షన్ లో పేర్కొన్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫోటో ఎక్కడిదని వివరాలే సేకరించగా.. ఆ ఫొటో 2017 నాటిదని వెల్లడైంది. కేంద్ర మంత్రి వర్గం.. ఉన్నత స్థాయిలో ఉన్న అమిత్ షా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ విధమైన ఫొటోను పోస్టు చేశాడని క్రైమ్ బ్రాంచ్ కేసుని సీరియస్ గా తీసుకుంది.
పలు అభియోగాల కింద డైరెక్టర్ అవినాశ్ దాస్ పై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో అవినాశ్ ముందుగానే బెయిల్ అప్లై చేసుకున్నారు.. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ లభించలేదు. సెషన్స్ కోర్టు అతడి పిటిషన్ ను తిరస్కరించింది. తనను అహ్మదాబాద్ తరలించకుండా చూడాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అవినాశ్ దాస్ కి నిరాశ తప్పలేదు.
ఇది చదవండి: దారుణం: DSP ర్యాంకు పోలీస్‌ను రాళ్ల లారీతో తొక్కి చంపిన మైనింగ్ మాఫియా