దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే ఇంకా కొన్ని మారుమూల గ్రామాల్లోని ప్రజలు మూఢ విశ్వాసాలు, చేతబడి వంటి వాటిని నమ్మి శారీరకంగా, ఆర్థికంగా మోసపోతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ భార్య తన భర్తను చెప్పుచెతుల్లో పెట్టుకునేందుకు చేతబడి చేసిందట. దీనిని పసిగట్టిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఏకంగా కోర్టు మెట్లెక్కాడు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కాలం నుంచి భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం భర్తను ఇల్లరికం రావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందులో భాగంగానే భార్య భర్త తన వైపుకు తిప్పుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసిందట. భార్య నాపై చేతబడి పూజలు చేయిస్తుందని గ్రహించిన భర్త ఇటీవల భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించకపోవడంతో పాటు ఎలాంటి న్యాయం చేయలేదు. విరక్తి చెందిన భర్త ఏకంగా కోర్టు మెట్లెక్కాడు.
నా భార్య నాపై చేతబడి చేయిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నేను తినే ఆహారంలో అనేక సార్లు బుడిద రంగుతో కూడిన అన్నాన్ని వడ్డిస్తుందని, ఇంట్లో అక్కడక్కడ నిమ్మకాయలు, కుంకుమ, వంటివి కనిపించాయని తెలిపాడు. ఇక ఇదే కాకుండా నా భార్య మొబైల్ లో కొన్ని కాల్ రికార్డింగ్ విన్నాను. వాటితో నా అనుమానం నిజమైందని భర్త కోర్టుకు వివరించాడు. బాధితుడి కేసును స్వీకరించిన కోర్టు కొన్ని సెక్షన్ల కింద భార్య, అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భార్య నాపై చేతబడి చేస్తుందంటూ కోర్టుమెట్లెక్కిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.