ఆ మహిళకు ఎప్పటి నుంచో భర్తపై అనుమానం. తరుచు ఫోన్ లో తెగ మాట్లాడుతుండేవాడు. అయితే ఓ రోజు అసలు నా భర్త ఫోన్ లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నాడని కనిపెట్టే ప్రయత్నం చేయగా భర్త మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది. అయితే భర్త ప్రియురాలిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్ తో వెళ్ళిన ఆ వివాహిత ఎట్టకేలకు పట్టుకుంది. అనంతరం ఆ యువతి జుట్టు కత్తిరించి దేహశుద్ది చేసింది. ఇటీవల బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గయాలోని టవర్ చౌక్. ఇదే ప్రాంతంలో రాకేష్‌కుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి సుభద్ర అనే మహిళతో పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే రాకేష్ కుమార్ స్థానికంగా బట్టలషాపు నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే ఇతని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ఎంచక్కా ఫోన్ లో మాట్లాడుతూ బయటకు కూడా కలుసుకునేవారు. ఇక కొన్ని రోజుల తర్వాత భర్త ప్రవర్తనను గమనించిన భార్య సుభద్ర ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది.
ఇందులో భాగంగానే ప్రతీ రోజూ భర్త ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతుండడంతో ఓ కంట కనిపెట్టి భర్త ప్రియురాలిని పక్కా ప్లాన్ తో పట్టుకుంది. ఇంతటితో ఆగకుండా ఆ ప్రియురాలి జుట్టు కత్తిరించి దేహశుద్ది చేసింది. దీనిని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.