దేశంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుడి, బడి అని తేడా లేకుండా అడ్డొచ్చిన ఆడ పురుగుపై కొందరు కేటుగాళ్లు కోరికలు తీర్చుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటు పండు ముసలవ్వల నుంచి అటు అయిదేళ్ల చిన్నారుల వరుకు ఇలా ఎవ్వరినీ కూడా వదలకుండా అత్యాచారాలు చేస్తూ ఆడదానికి నరకం చూపిస్తున్నారు. ఇలాంటి సంచలన ఘటనలపై ప్రభుత్వాలు ఇప్పటికే నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ప్రవర్తనలో ఏ మాత్రం కూడా మార్పు రావడం లేదు.
అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ తండ్రి తన మైనర్ కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా తన తల్లి సాయంతో తండ్రి ఆ బాలికను వ్యభిచారంలోకి నెట్టేస్తున్నారు. ఈ దారుణం కొన్నాళ్ల నుంచి జరుగుతుండడంతో ఆ మైనర్ బాలిక తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. ఇటీవల బీహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని సమస్తిపూర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..
భార్య ఓ కూతురితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే తన కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిప ఈ దుర్మార్గుడు గత కొంత కాలం నుంచి కన్న కూతురిపైనే అత్యాచారం చేస్తున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా తండ్రి తన తల్లి సాయంతో వ్యభిచారాల్లోకి కూడా పంపిస్తున్నారట. కన్న తల్లిదండ్రులే ఇంతటి దారుణానికి పాల్పడడంతో ఆ మైనర్ బాలిక ఎవరికి చెప్పాలో అర్థం కాకపోయేది. ఇక ఎన్నో రోజుల నుంచి తండ్రి ఆగడాలను భరించలేకపోతున్న ఆ కూతురు సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.
నా తండ్రి నాపై అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై స్పందించిన స్థానిక పోలీసులు ఆ మైనర్ బాలిక తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ భార్యాభర్తలిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న వారిని పట్టుకునేందుకు గాలంపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.