పైన ఫొటోలో ఏం తెలియనట్టు అమాయకంగా కనిపిస్తున్న వ్యక్తి ఓ టీచర్, కాదు కాదు చీటర్. స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అలా కొంత కాలం తర్వాత ఇతగాడు తన అసలు క్యారెక్టర్ ను బయటకు తీశాడు. స్కూల్ లో విద్యార్థినులకు తెలియకుండా వారి అసభ్యకరమైన వీడియోలను తన సెల్ ఫోన్ లో తీసుకునేవాడు. అలా తీసుకున్న ఆ వీడియోలను విద్యార్థులకు చూపించి బ్లాక్ మెయిల్ కు దిగేవాడు. ఇలా ఎంతో మంది విద్యార్థినుల వీడియోలు తీసి పాడుపనికి శ్రీకారం చుట్టాడు. తర్వాత ఏం జరిగింది? ఈ దుర్మార్గుడిని పట్టుకున్నారా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్ నావాడ పరిధిలోని మదర్సాలో వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంత కాలం పాటు ఇదే స్కూల్ లో పిల్లలకు చదువు చెప్పేవాడు ఇక. కొన్ని రోజుల తర్వాత ఈ ఉపాధ్యాయుడు మెల్ల మెల్లగా తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. అందంగా ఉన్న బాలికలను వారికి తెలియకుండా తన సెల్ ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు తీసేవాడు. అలా తీసిన ఆ వీడియోలను అదే బాలికలకు చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని కూడా బెదిరించేవాడు. అచ్చం ఇలాగే ఇటీవల ఓ బాలిక వీడియోలు తీసి ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఆ వీడియోలను చూసిన ఆ బాలిక ఒక్కసారిగా షాక్ కు గురైంది.
దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అభం శుభం తెలియని విద్యార్థులపై ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ టీచర్ పాడుపనులకు ఇతడికి మీరు అయితే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.