వేరే వ్యక్తితో కలిసి తన చెల్లి రీల్స్ చేస్తుందని ఓ అన్న రెచ్చిపోయాడు. సొంత చెల్లి అని కూడా చూడకుండా..
టెక్నాలజీ మనిషిని ఎంత పైకి తీసుకెళ్తుందో తెలియదు కానీ అదే టెక్నాలజీ పేరుతో కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. టిక్ టాక్ భారతీయులకు ఒక జబ్బుని అంటించి వెళ్ళిపోయింది. దీంతో రీల్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ రీల్స్ కూడా కొన్ని శృతి మించే విధంగా ఉంటున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అయితే నచ్చకపోతే నచ్చజెప్పాలి కానీ చంపేయడం కూడా కరెక్ట్ కాదు. తన సోదరి వేరే వ్యక్తితో కలిసి రీల్స్ చేస్తుందని సొంత అన్నే దారుణానికి ఒడిగట్టాడు. రీల్స్ చేస్తుందని సొంత చెల్లెలిని హతమార్చిన ఘటన కలకలం రేపింది. వేరే వ్యక్తితో కలిసి రీల్స్ చేస్తుందని తలపై రోకలి బండతో మోది చంపేశాడు.
అంతలా అన్నని ప్రేరేపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ కోర్సు చేస్తున్న అజ్మీరా సింధు అలియాస్ సంఘవి అనే యువతి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. వద్దని అన్న హరిలాల్ చాలా సార్లు నచ్చచెప్పాడు. కానీ ఆ యువతి మానుకోలేదు. ఒకరోజు సింధు సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసే విషయంలో అన్నా, చెల్లెళ్ళ మధ్య ఇంట్లో ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన హరిలాల్.. సింధు తలపై రోకలి బండతో గట్టిగా మోదాడు. రక్తం రావడంతో ఆమెను తల్లి, హరిలాల్ ఇద్దరూ ఖమ్మంలోని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించగా.. తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే సింధు చనిపోయింది. ప్రస్తుతం హరిలాల్ పరారీలో ఉన్నాడు. అయితే ఆమెను చంపేంతగా హరిలాల్ ని ప్రేరేపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఆమె వేరే వ్యక్తులతో కలిసి వీడియోలు చేస్తుందని.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందని హరిలాల్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ వీడియోల్లో ఆమె ఆ వ్యక్తిని హగ్ చేసుకోవడం లాంటివి కూడా చేసింది. ఇది నచ్చకే హరిలాల్ తన చెల్లిని చంపి ఉంటాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ అన్నకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం తిడుతున్నారు. మరి అన్న చెల్లిని చంపడానికి కారణమైన ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.