దేశంలో క్రైమ్ కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఆస్తి గొడవలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో రకాల వ్యవహారాల్లో క్షణికావేశంలో కొందరు హత్యలకు కాలు దువ్వుతున్నారు. అయితే ఇటీవలమ ఓ భార్యాభర్తల గొడవలో భాగంగా ఓ అల్లుడు సొంత అత్తనే దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగా అత్తను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అది బెంగుళూరులోని హెచ్ఏఎల్. ఇదే ప్రాంతంలో నాగరాజు, భవ్యశ్రీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కిందట వివాహం జరగగ ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ కొన్ని రోజులు గడిచాక భర్త తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడేవాడు. దీంతో భర్తతో ఉండలేని భార్య భవ్యశ్రీ సంజయనగరలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త నాగరాజు అత్తింటివాళ్లతో గొడవకు దిగేవాడు.
ఇది కూడా చదవండి: చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే బాలిక మృతి.. అసలు ఏం జరిగింది!
ఇదిలా ఉంటే ఈ నెల 12న తన భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు ఇటీవల నాగరాజు అత్తింటికి వెళ్లాడు. దీంతో నా భార్యను నా ఇంటికి పంపాలంటూ నాగరాజు అత్తతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన నాగరాజు వెంట తెచ్చుకున్న సుత్తితో అత్తను దారుణంగా కొట్టాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్స పొందుతూ ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.