ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీనాథ్. వయసు 22 ఏళ్లు. బెంగుళూరు కృష్ణంరాజుపురం పరిధిలో హీరండహళ్లిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే శ్రీనాథ్ స్థానికంగా ఉండే ఈస్ట్ పాయింట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. కానీ ఇతనికి చిన్నప్పటి నుంచి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనే ఆశ బలంగా ఉండేది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న గత కొన్నేళ్ల నుంచి ఓ జిమ్ సెంటర్ లో జాయిన్ పగలు రాత్రుళ్లు చెమటలు కక్కుతూ జిమ్ చేస్తూ ఉండేవాడు. అలా కొంత కాలం తర్వాత కండలు తిరిగిన బాడీ బిల్డర్ లా మారిపోయాడు. ఇక ఇంతటితో ఆగని శ్రీనాథ్ పలు పోటీల్లో తన ప్రదర్శనతో అదరగొట్టాడు.
ఇకపోతే శ్రీనాథ్ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా జీవించాలనుకున్నాడు. కానీ.. ఎందుకో ఏమో తెలియదు కానీ.. ఆ యువకుడు చిన్న వయసులోనే ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే? శ్రీనాథ్ మంగళవారం ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఎందుకో అనుమానం వచ్చి కొందరు స్థానికులు శ్రీనాథ్ ఇంట్లోకి వెళ్లి చూడగా… ఆ యువకుడు ఉరి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ ను చూసిన వెంటనే స్థానికులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్న శ్రీనాథ్ తల్లిదండ్రులు ఫ్యానుకు వేలాడుతున్న కొడుకుని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. మా కుమారుడు ఇక కనిపించడు, రాడు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం శ్రీనాథ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కొడుకు చనిపోయేంత పిరికివాడు కాదని, దీని వెనకాల ఏదో జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.