ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు పరాయి సుఖం కోసం కట్టుకున్న వాళ్లకి పంగనామాలు పెడుతున్నారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి తమ్ముడి భార్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. ఇక ఇంతటితో ఆగకుండా సమయం దొరికినప్పుడల్లా మరదలితో ఎంజాయ్ చేస్తూ చివరికి తమ్ముడి చేతులో హతమయ్యాడు. తాజాగా బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
కర్ణాటక బెళగావి జిల్లాలోని చిక్కోడి పట్టణంలో అక్బర్ షేక్, అమ్జద్ షేక్ ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరు ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. అయితే ఒకే భవనంలో ఉంటుండడంతో అన్న అక్బర్ తమ్ముడి భార్యతో అక్రమ సంబంధాన్ని నడిపించాడు. సమయం దొరికినప్పుడల్లా అక్భర్.. బెడ్ రూంలో దూరిపోయి తన మరదలితో తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇదే విషయం కొన్నాళ్ల తర్వాత తన తమ్ముడైన అమ్జద్ కు తెలిసింది. ఇలా అయితే కాదని భావించిన అమ్జద్.. పెద్దల సమక్షంలో పంచాయితి పెట్టించి వార్నింగ్ ఇచ్చాడు.
అయినా తన పాడుబుద్దిని మార్చుకోని అక్భర్ మరదలితో మళ్లీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తట్టుకోలేకపోయిన తమ్ముడు.. ఎలాగైన అన్నను హత్య చేయాలని అనుకున్నాడు. ఇక అనుకున్నదే ఆలస్యం.. అమ్జద్ ఇటీవల అన్నను ఫాలో అయ్యాడు. ఒంటరిగా బైక్ పై వెళ్తుండగా వెనకాల నుంచి తమ్ముడు కారుతో ఢీ కొట్టాడు. దీంతో అక్బర్ కింద పడిపోయాడు. వెంటనే కారులో నుంచి దిగిన తమ్ముడు అమ్జద్.. పదునైన ఆయుధంతో అన్న అక్బర్ ను దారుణంగా హత్య చేశాడు. తమ్ముడి దాడిలో అన్న అక్బర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అమ్జద్ తన నేరాన్ని ఒప్పుకుంటూ చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.