అది ఒడిశాలోని సంబల్ పూర్ సమీపంలోని కూచిండా ప్రాంతం. యువతి యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు కాదనేసరికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ నచ్చిన జీవితాన్ని గుడిపారు. అనుకున్నట్లుగానే లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో వీరి జీవితం కొన్నాళ్లపాటు సంతోషంగా సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కుటుంబికులు వీరి నిర్ణయానికి ఓకే చెప్పి ఇద్దరినీ దగ్గరకు చేర్చుకున్నారు.
అలా కొన్ని రోజులు ఆనందమైన జీవితాన్ని గడిపారు. రోజులు గడుస్తున్న కొద్ది భర్త ప్రవర్తనలో మార్పొచ్చి భార్యను తీవ్రంగా అనుమానించేవాడు. ఫోన్ మాట్లాడినా, ఎవరితోనైన మాట్లాడినా అంతే భర్తకు చిర్రెత్తుకొచ్చేది. అలా భార్యపై అనుమానం మరింత పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. భార్య కుటింబికులు రెండుమూడు సార్లు సర్దిచెప్పి ఒప్పించారు.
ఇది కూడా చదవండి: చపాతీ ఎక్కువ తిన్నందుకు అత్తను చావగొట్టింది.. కోడలు పాపం పండి..
అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల పుట్టింట్లో ఉన్న భార్యను భర్త తమ ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లోనే భార్యను సజీవదహనం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.