ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య చికెన్ కూర వండి అన్నం వండలేదు. ఈ కారణంతోనే భర్త భార్యను కొట్టి చంపాడు. అనంతరం నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది.
అది ఒడిశాలోని సంబల్ పూర్ సమీపంలోని కూచిండా ప్రాంతం. యువతి యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు కాదనేసరికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ నచ్చిన జీవితాన్ని గుడిపారు. అనుకున్నట్లుగానే లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో వీరి జీవితం కొన్నాళ్లపాటు సంతోషంగా సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కుటుంబికులు వీరి నిర్ణయానికి ఓకే చెప్పి ఇద్దరినీ దగ్గరకు చేర్చుకున్నారు. అలా కొన్ని రోజులు ఆనందమైన జీవితాన్ని గడిపారు. రోజులు గడుస్తున్న కొద్ది […]