ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య చికెన్ కూర వండి అన్నం వండలేదు. ఈ కారణంతోనే భర్త భార్యను కొట్టి చంపాడు. అనంతరం నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది.
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంత దానికే కొందరు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, కొత్త చీర కొనివ్వలేదనే కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో చికెన్ వండలేదనే ఓ భర్త భార్యను చంపిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మాత్రం.. అన్నం వండలేదని ఓ భర్త భార్యను దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ జిల్లాలోని నాధి గ్రామం. ఇక్కడే సనాతన్-పుష్ప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు తరుచు గొడవ పడ్డట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. సోమవారం భర్త ఆకలితో ఇంటికొచ్చాడు. ఇంట్లో చికెన్ కూర ఉంది కానీ, అన్నం వండలేదు. దీంతో భర్త సనాతన్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అదే సమయానికి భార్య ఇంటికి వచ్చింది.
ఇదే విషయంపై సనాతన్ భార్య పుష్పతో గొడవ పడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఆవేశంతో ఊగిపోయిన సనాతన్.. భార్యను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. భర్త దాడిలో భార్య పుష్ప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇంటికి చేరుకుని చూడగా తల్లి చనిపోయి కనిపించింది. అతడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుష్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సనాతన్ నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నం వండలేదని భార్యను కొట్టి చంపిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.