కాదు ఏ శాఖా లంచానికి అనర్హం అన్నట్లు.. దేశం ఆ మూలనుంచి ఈ మూల వరకు ఉన్న అన్ని ప్రభుత్వ రంగ శాఖల్లో అవినీతి వేళ్లూనుకు పోయింది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారాలుగా మారుతున్నారు. చిన్న పని చేసి పెట్టడానికి కూడా లంచం తీసుకుంటున్నారు. తాజాగా, ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఇంట్లో ఏకంగా 49 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఈ సంఘటన అస్సాంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేకే శర్మ అనే వ్యక్తి అస్సాం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
శర్మ లంచాలకు బాగా రుచి మరిగాడు. ఏ పని చేయడానికైనా లంచం తీసుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ సెక్యూరిటీ కంపెనీకి చెందిన కొందరు వ్యక్తులు కంపెనీ రెన్యూవల్‌కు సంబంధించిన సంతకాల కోసం ఆయన దగ్గరకు వచ్చారు. సాధారణంగా అయితే, అన్నీ సరిగా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసి సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయన మాత్రం అన్నీ సరిగా ఉన్నా సంతకం చేయలేదు. సంతకం పెట్టాలంటే 90 వేల రూపాయలు లంచం ఇవ్వాలన్నాడు. దీంతో వారు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
అందరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. కంపెనీ వాళ్లు 90 వేల రూపాయలతో ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన చేతిలో డబ్బులు పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి శర్మను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇంట్లో భారీగా నగదు బయటపడింది. దాదాపు 49 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. సంబంధిత సెక్షన్ల కింద డబ్బుల్ని సీజ్ చేశారు. శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.