విద్యాబుద్దులు నేర్పాల్సిన కొందరు లెక్చరర్లు ఏకంగా విద్యార్థినిలను వేధింపులకు గురి చేస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ మాస్టారు విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: అమ్మాయి పేరుతో రిక్వెస్ట్, ప్రేమ పేరుతో వాయిస్ కాల్.. చివరికి జరిగింది ఇదే!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో మాధవరెడ్డి అనే లెక్చరర్ ను పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అయితే ఈ మాస్టారు ఓ విద్యార్థినిపై ఎక్కువ మార్కులు వచ్చేలా చూస్తానంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.