అర్థరాత్రి తన ఇంటికి దూరంగా ఓ చోట దాక్కున్నాడు రమేష్. తీక్షణంగా ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. కళ్లు కూడా ఆర్పడం లేదు. ఫ్రెండ్ చెప్పిన మాటలు నిజమా?.. అబద్ధమా అన్న దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ‘‘ దేవుడా అది నిజం కాకూడదు.. అది నిజం కాకూడదు’’ అని చాలా సేపటినుంచి ప్రార్థిస్తున్నాడు. కొద్ది సేపటి తర్వాత అతడి కళ్లు పెద్దవయ్యాయి. ఇంటికి కొద్ది దూరంలో ఆగిన బైకు వైపు చూస్తూన్నాడు. ఆ బైక్‌పై వచ్చిన అతడు అటు,ఇటు చూస్తూ రమేష్ ఇంట్లోకి దూరాడు. రమేష్ కంట్లో నీళ్లు ఆగటం లేదు.. తన భార్య తప్పు చేస్తోందని నమ్మలేకున్నాడు. అతడు ఇంట్లోకి వెళ్లటాన్ని నిజం కాదని కొట్టి పారేయలేకున్నాడు. కోపంగా ఇంటి వైపు నడిచాడు. గోడ దూకి బెడ్ రూం కిటికీ దగ్గరకు చేరాడు.
లోపల ఏవో గుసగుసలు వినపడుతున్నాయి. నవ్వులు కూడా. అతడి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది. గుండెను రంపాలతో చీరుతున్నట్లుగా ఉంది. మెల్లగా కిటికీ తలుపులు తెరిచాడు. లోపల దృశ్యాన్ని చూసి గుండె పగిలింది. తను ఎంతగానో ప్రేమించిన భార్య.. నమ్మిన భార్య.. నగ్నంగా ఒకడి గుండెపై వాలి ఉంది! ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడలేకపోయాడు. వెంటనే అక్కడినుంచి పక్కకు వచ్చేశాడు. తన కొచ్చే కోపానికి వాళ్లిద్దర్నీ చంపేయాలని ఉంది. కానీ, ఇంటి దగ్గర రచ్చ చేసి పరువు తీసుకోవటం ఇష్టం లేక వచ్చేశాడు. రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తనను మోసం చేసిన భార్యతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు అప్లై చేశాడు. ( అభిమాన హీరో సినిమా బాగాలేదని.. యువకుడి ఆత్మహత్య )
భర్త విడాకులకు అప్లై చేయటంతో మొదట షాక్ తింది భార్గవి. భర్తకు వెంటనే ఫోన్ చేసింది. ఏమైందని అడిగింది. ఫోన్‌లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బూతులు తిడుతూ ఆమె సంబంధం గురించి చెప్పాడు. అదేమీ లేదని బుకాయించింది. తాను కల్లారా చూశానని చెప్పాడు. కొద్దిగా వెనక్కు తగ్గింది. ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమెకు. అతడు మరికొన్ని బూతులు తిట్టి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపు బాధపడింది. బాగా ఆలోచించి తనకు కావాల్సింది కూడా అదే అనుకుంది. భర్తకు విడాకులు ఇస్తే ప్రియుడు కళ్యాణ్‌తో హ్యాపీగా ఉండొచ్చని అనుకుంది. భర్తను దుబాయ్ పంపడం.. కళ్యాణ్‌తో పరిచయం అంతా ఓ సారి ఆమె కళ్లముందు కదిలాయి.
రమేష్‌ను పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు భార్గవికి. ఎవరన్నా డబ్బున్న వాడ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడపాలనుకుంది. కానీ, తన స్థోమతకు తగ్గట్టు ఓ మధ్య తరగతి కుటుంబంలోని వ్యక్తిని పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత భర్తను ఒప్పించి దుబాయ్‌కి పంపింది. రమేష్‌కు భార్యను వదిలి దుబాయ్ పోవటం ఇష్టం లేదు. ‘పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే దుబాయ్ పోవటం ఏంటి?’ అనుకున్నారు బంధువులంతా. కానీ, తప్పలేదు. దుబాయ్ వెళ్లిపోయాడు. ఊర్లో ఉంటే కుటుంబసభ్యులు, బంధువులు మాటలతో.. చేతలతో భార్యను వేధిస్తారని భావించాడు. దుబాయ్ వెళ్లే ముందు భార్యను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు.
హైదరాబాద్ లో భార్యని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక.. భార్య అమ్మగారు పద్మావతిని పిలిపించాడు. తరువాత రమేష్ దుబాయ్ వెళ్లిపోయాడు. నెలనెలా తను సంపాదించిన దాంట్లో చాలా డబ్బు ఇంటికి పంపేవాడు. భర్త పంపిన డబ్బుతో తల్లీకూతుళ్లు జల్సాలు చేసేవాళ్లు. ప్రతి రోజూ డ్యూటీ చేసినట్లు షాపింగ్ చేసేది భార్గవి. ఇలాంటి టైంలో ఓ షాపింగ్ మాల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న కళ్యాణ్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం కొద్దిరోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచుగా హోటల్స్‌లో కలిసేవారు.
కోర్కెలు తీర్చుకునేవారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లటం మొదలుపెట్టింది. తల్లికి అతడ్ని తన స్నేహితుడిగా పరిచయం చేసింది. ఆమెను ఏదో ఒక పని మీద బయటకు పంపి.. ఆ టైంలో శృంగారంలో పాల్గొనేవారు. ఓ రోజు ఇద్దరు శృంగారంలో ఉండగా.. పద్మావతి చూసింది. కూతుర్ని నిలదీసింది. ‘‘కళ్యాణ్ లేకపోతే నేను చచ్చిపోతా’’ అని తల్లిని బెదిరించింది భార్గవి. ఆ డైలాగ్‌తో పద్మావతి క్లీన్ బౌల్డ్ అయింది. వారిని పట్టించుకోవటం మానేసింది. తర్వాతనుంచి తల్లి ముందే వారు సరసాలు ఆడుకునేవారు. ఓ రోజు భర్త ఫోన్ చేసి కళ్యాణ్ గురించి ఆరాతీశాడు. ఎవరో తెలియదని చెప్పింది.
‘‘ కళ్యాణ్ అనే వాడితో నువ్వు చాలా క్లోజ్‌గా ఉంటున్నావని నాకు ఫోన్ వచ్చింది. ప్రతి రోజూ ఇంటికి వచ్చిపోతున్నాడంట’’ అడగలేక అడిగాడు రమేష్. భార్గవి తన నటనా చాతుర్యాన్ని బయటపెట్టింది. అస్కార్ లెవల్ పర్‌ఫార్‌మెన్స్ చేసింది. ఆమె కన్నీళ్లకు కరిగిపోయాడు రమేష్. మారు మాట్లాడలేకపోయాడు. కానీ.. తాను ఫోన్ లోఎంత నమ్మించినా.. రమేష్ ఫ్రెండ్ అతనికి జరిగింది అంతా చెప్పడంతో రమేష్ ఇలా ఇండియాకి వచ్చి నిజాన్ని కళ్లారా చేసేశాడని భార్గవికి అర్ధం అయిపోయింది. ఇక చేసేది లేక.. భార్గవి తన తప్పు ఒప్పుకుని రమేష్ కి విడాకులు ఇవ్వడానికి అంగీకరించింది. నిజానికి.. ఇప్పుడు కూడా ఆ తల్లికూతుళ్ళకి వచ్చిన నష్టం లేదు. కానీ.., భార్యని బాగా చూసుకోవాలని రమేష్ దుబాయ్ కి వెళ్లి చేసిన కష్టం అంతా బూడిద పాలు అయ్యింది. తన జీవితం కూడా నాశనం అయ్యింది. మరి.. మగవాళ్ల జీవితాలతో ఆటలు ఆడే.. ఇలాంటి ఆడవారికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీధి కుక్క నోట్లో శిశువు తల.. షాక్ అయిన జనం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.