ఈమె పేరు ఆషాబీ. తపల్ బాబాను గత 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త స్థానికంగా బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అలా 15 ఏళ్లు గడిచింది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. కానీ తరుచు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండేవారు. కట్ చేస్తే ఆషాబీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి భర్త తట్టుకోలేక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామంలో తపాల్ బాబా అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. గతంలో ఇతడు పెనకచర్ల గ్రామానికి చెందిన ఆషాబీ అనే యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. వీరి పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. అలా కొన్నేళ్ల పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలోనే గతంలో వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అలా వీరి సంసారం సాగుతున్న తరుణంలోనే భార్యాభర్తలు తరుచు ఏదో విషయమై గొడవపడుతుండేవారు. దీంతో ఇద్దరి ఆమోదంతోనే గతంలో విడాకులు కూడా తీసుకున్నారు.
దీంతో అప్పటి నుంచి ఆషాబీ వేరుగా ఉండేది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఆషాబీ స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. ఆ పరిచయంతోనే ఇద్దరు కాస్త దగ్గరయ్యారు. ఇక ఆషాబీ ఇటీవల అతనిని పెళ్లి కూడా చేసుకుంది. ఇదే విషయం తన మొదటి భర్త తపాల్ బాబాకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇదే కాకుండా ఆషాబీ తన మొదటి భర్తతో కలిసి తపాల్ బాబా ముందే తిరుగుతూ ఉండేది. ఇదే తపాల్ బాబాకు నచ్చలేదు. దీనిని సహించకలేకపోయిన తపల్ బాబా ఎలాగైన ఆషాబీని చంపాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తపల్ బాబా బుధవారం రాత్రి ఆషాబీ ఇంటికెళ్లి తలుపు కొట్టాడు.
దీంతో వెంటనే ఆషాబీ, ఆమె సోదరుడు తలుపులు తీశారు. వెంట వెంటనే తపల్ బాబా కత్తితో ఇద్దరిని దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యడు. తపల్ బాబా దాడిలో ఆషాబీ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, ఆషాబీ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తపాల్ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.