ప్రేమిస్తున్నానని వెంట పడ్డ ఓ యువకుడి యువతిని ప్రేమపేరుతో తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. దీంతో నమ్మిన ఆ యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియుడు అడిగినప్పుడుల్లా దశలవారిగా సొమ్మును అందించింది. ఇలా ఒకటి కాదు రెండ కాదు.. ఏకంగా రూ.11 లక్షలు కాజేసిన ప్రియుడు కనిపించకుండా పరారయ్యాడు. అనకాపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలోని యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన మైనర్ యవతి(16) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకుంటానంటూ ప్రియుడు ప్రియురాలిని నమ్మించాడు. దీంతో ప్రియుడు మెల్లగా ప్రియురాలిని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. మాటా మాటా కలిపిన ప్రియుడు ప్రియురాలి వద్ద నుంచి మొదటగా రూ.2 లక్షల వరకు ఫోన్ పే ద్వారా.. తర్వాత రూ.6 లక్షలు నేరుగా నగదు రూపంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా డబ్బుల విడతల వారీగా ప్రియురాలు ప్రియుడికి ఇచ్చినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Ranga Reddy:అర్ధరాత్రి ఫోన్ లో మరొకరితో భార్య.. భర్తకి తెలియగానే!
అయితే ప్రియురాలి తల్లిదండ్రులు ఇంట్లో డబ్బులు కనిపించకపోవడంతో కూతురిని ప్రశ్నించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.